Page Loader
Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు
వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

Mahua Moitra: సమయం కోరుతున్న ఎంపీ మహువా మోయిత్రా.. వచ్చే నెలలోనే ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ముందుకు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 27, 2023
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

నగదుకు ప్రశ్న కేసులో పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలోని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్‌సభ ఎథిక్స్ ప్యానెల్ కమిటీకి ఝలక్ ఇచ్చారు. ఈ మేరకు తాను అక్టోబర్ 31న కమిటీ ముందుకు రాలేనని చెప్పారు. తన నియోజకవర్గంలో ముందస్తు షెడ్యూల్ పనులున్నాయని చెప్పుకొచ్చారు. ఫలితంగా ఆ రోజు రాలేనని తేగేసి చెప్పేశారు. వచ్చే నెల, నవంబర్ 4 వరకు నియోజకవర్గ కార్యాక్రమాలు ఉన్నాయని, నవంబర్ 5న కమిటీ ముందుకు వస్తానన్నారు. ఇదే సమయంలో తనపై వచ్చిన తీవ్ర ఆరోపణల దృష్ట్యా సహజ న్యాయ సూత్రాల మేరకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందనిని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు తనను అనుమతించాలని కోరారు. ఈ మేరకు ప్యానెల్‌ కమిటీకి ఆమె రెండు పేజీల లేఖ రాశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్యానెల్ కమిటీ ముందుకు వచ్చేందుకు గడువు కోరిన మహువా మోయిత్రా