LOADING...
వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 07, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి రాసిన లేఖపై కలర్ జిరాక్స్ కాపితో నిన్‌హైడ్రిన్‌ పరీక్ష జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హత్య జరిగిన ఘటనా స్థలంలో గతంలో లభించిన వైఎస్ వివేకా రాసిన లేఖను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ అయ్యాక సదరు లేఖను 2021 ఫిబ్రవరి 11న దిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు సీబీఐ తరలించింది. అలాగే వివేకా చేతి దస్తూరితో ఉన్న గత లేఖలను సైతం సీఎఫ్‌ఎస్‌లకు పంపించింది.

Cbi Court Accepts Viveka Hand Writing Letter For NinHydrin  

అది ఒత్తిడిలో రాసిన లేఖనే : ఫారెన్సిక్ నిపుణులు

గత లేఖలను, వైఎస్ వివేకా చేతిరాతను క్షుణ్ణంగా పరీక్షించిన సీఎఫ్‌ఎస్‌ఎల్ ( సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ ) నిపుణులు, అది ఒత్తిడిలో రాసిన లేఖగా తేల్చి చెప్పారు. చేతి రాతతో పాటు లేఖపై ఉన్న వేలిముద్రలనూ గుర్తించాలని ఫారెన్సిక్ నిపుణులను సీబీఐ కోరింది. ఇందుకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష చేస్తే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ బదులిచ్చింది. లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినేందుకు అవకాశం ఉండటంతో సీబీఐ అధికారులు కోర్టు అనుమతి కోరారు. రికార్డుల్లో ఒరిజినల్‌ లేఖకు బదులు కలర్‌ జిరాక్స్‌ అనుమతించాలని సీబీఐ కోరింది. ఈ మేరకు కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నిన్‌ హైడ్రిన్‌ పరీక్షకు అనుమతిచ్చింది.