ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం
బెంగళూరులో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక నిమిషం పాటు పట్టపగలు నిడలు అదృశ్యమయ్యాయి. సూర్యుడు మంగళవారం తలపైకి వచ్చిన 12:17గంటల సమయంలో నిటారుగా నిలబెట్టిన వస్తువుల నీడలు కనపడకపోవడం గమనార్హం. 'జీరో షాడో డే' ఎఫెక్ట్ వల్లే ఇలా జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం సూర్యుడు మధ్యాహ్న సమయంలో తలపైకి రాకుండా ఉత్తరం వైపు లేదా కొంచెం దక్షిణం వైపుకు వెళతాడు. ఫలితంగా భూమి భ్రమణ అక్షం 23.5డిగ్రీల వంపులో ఉంటుంది. భూమి అక్షం మీద వంపు కారణంగా 'జీరో షాడో' ఏర్పడుతుంది. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంవత్సరానికి రెండుసార్లు సంభవిస్తుంది. దేశంలో బెంగళూరులో ఆ ఆద్భుతం జరిగింది. ఆక్కడి ప్రజలు ఆ అనుభూతిని పొందారు.