
AP Floods : నేడు ఏపీకి కేంద్ర బృందం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు,రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని,వరద నష్టాన్ని అంచనాకు కేంద్ర బృందం పంపించాలని, తక్షణ సాయం అందించాల్సిన అవసరాన్ని తెలిపే లేఖను రాశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అంశంపై స్పందిస్తూ,హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలోని నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ బృందం నేడు రాష్ట్రంలో పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి నివేదిక అందించనుంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,రాష్ట్రంలో వరద పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ,డ్యామ్ భద్రత వంటి అంశాలను పరిశీలించి,నష్టాన్ని అంచనావేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు.
వివరాలు
క్షేత్ర స్థాయి పర్యటన
సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలుపుతూ, కేంద్ర బృందం సిఫారసులు అందించేంత వరకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, బాధిత ప్రజలకు తక్షణ సాయం అందించడంలో పూర్తిగా సహకారం అందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
ప్రస్తుతం, వరద బాధితుల సంఖ్య 6.44 లక్షలకు చేరుకోగా, 42,707 మందిని 193 సహాయక శిబిరాలకు తరలించారు.
వివరాలు
కేంద్రానికి నివేదిక
కేంద్ర బృందం హోం శాఖ అదనపు కార్యదర్శి నవీన్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఏర్పాటైంది.
ఈ బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సలహాదారు కల్నేర్ కేపీ సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిద్దార్ద మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాద్ ఎస్ఈ ఎం రమేష్ కుమార్, ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ డైరెక్టర్ గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాడెంట్ ప్రసన్న తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఈ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటన చేసిన తర్వాత, ఈ సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశం అవుతారు.