
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో,కేంద్ర ప్రభుత్వం నేడు సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
ఈ సమావేశంలో పాకిస్థాన్‌పై తీసుకున్న సైనిక చర్యలు, సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులు వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్టు సమాచారం.
ఈ రకమైన సున్నితమైన జాతీయ భద్రతా అంశాల్లో అన్ని రాజకీయ పార్టీలు కలసి నడవాలని కేంద్రం భావిస్తోంది.
ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన చర్యలకు అన్ని పార్టీలూ మద్దతు తెలిపిన నేపథ్యంలో, ఈ సమావేశానికి అన్ని ప్రధాన పార్టీ నేతలను ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలు
రక్షణ మంత్రివర్యుల అధ్యక్షతన సమావేశం
ఈ సర్వపక్ష సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు.
హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సహా ఇతర కీలక కేంద్ర మంత్రులు కూడా ఇందులో పాల్గొననున్నారు.
జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా మాట్లాడుతూ, ప్రధాన పార్టీల నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముందని తెలిపారు.
వేదిక, సమయం
పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
ఈ సమావేశం గురించిన సమాచారాన్ని కిరణ్ రిజిజు తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
మే 8న ఢిల్లీలో జాతీయ భద్రత అంశాలపై సర్వపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పోస్ట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కిరణ్ రిజిజు చేసిన ట్వీట్
Govt has called an All Party leaders meeting at 11 am on 8th May, 2025 at Committee Room: G-074, in the Parliament Library Building, Parliament Complex in New Delhi. https://t.co/1hcBepMReC
— Kiren Rijiju (@KirenRijiju) May 7, 2025
వివరాలు
పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రం సర్వపక్ష సమావేశం
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం కూడా కేంద్రం సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
అదే తరహాలో, తాజా భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు అవుతోంది.