LOADING...
Chandrababu: ఏపీ,అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు భాగస్వామ్యం కావాలని సింగపూర్ అధికారులను కోరిన చంద్రబాబు 
ఏపీ,అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు భాగస్వామ్యం కావాలని సింగపూర్ అధికారులను కోరిన చంద్రబాబు

Chandrababu: ఏపీ,అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు భాగస్వామ్యం కావాలని సింగపూర్ అధికారులను కోరిన చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా సింగపూర్‌లోని బిడదారి ఎస్టేట్‌ను సందర్శించారు. ఈ ప్రదేశంలో దాదాపు 10 వేల కుటుంబాలు నివసిస్తున్నాయని అధికారుల సమాచారం. "సిటీ ఇన్ ఎ గార్డెన్" అనే ఆకర్షణీయమైన హౌసింగ్‌ మోడల్‌ ఎలా రూపుదిద్దుకుందో సీఎం చంద్రబాబుకు స్థానిక అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టును సింగపూర్‌ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (HDB) అభివృద్ధి చేసింది. సింగపూర్‌ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. పట్టణాలు, నగరాల్లో ఉన్నతమైన గృహాల నిర్మాణం గురించి ఈ సమావేశంలో చర్చించారు. నిర్మాణంలో చెట్లు తొలగించకుండా, సహజ జల వనరులను కాపాడుతూ అభివృద్ధి ఎలా సాధ్యపడుతోందో అధికారులు వివరించారు.

వివరాలు 

బిడదారి ప్రాజెక్టు రూపకల్పన పద్ధతి ఎంతో ఉత్తమం: చంద్రబాబు 

తదుపరి అడుగుగా, చంద్రబాబు బృందం సింగపూర్ అర్బన్ రీడెవలప్‌మెంట్ అథారిటీ అధికారులతో సమావేశమైంది. అంతేగాక, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అభివృద్ధిలో పాటిస్తున్న ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి వివరించారు. అలాగే, సింగపూర్ భాగస్వామ్యంతో ఏపీలో చేపట్టబోయే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులపై చర్చ సాగింది. బిడదారి ప్రాజెక్టు రూపకల్పన పద్ధతి ఎంతో ఉత్తమంగా ఉందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. పర్యావరణానికి హానికాలకుండా నిర్మించిన ఈ ప్రాజెక్టు నిజంగా ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అద్భుతమైన సాంకేతికత, ఉత్తమ అనుభవాల ఆధారంగా నూతన రాజధానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చివరగా, ఆంధ్రప్రదేశ్‌, అమరావతి ప్రాంతాల్లో చేపట్టబోయే గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా పాల్గొనాలని చంద్రబాబు సింగపూర్ అధికారులను కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిడదారి ఎస్టేట్ లో రెండు గంటల పాటు కాలి నడకన పర్యటించిన ముఖ్యమంత్రి