Page Loader
Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. 
Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు..

Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాలపై కలెక్టర్లు, మంత్రులు,అధికారులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. అధికారులు,ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై సమీక్ష చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్‌లు పంపించి అలర్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు.

వివరాలు 

ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో.. 

వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. అప్రమత్తతతో ప్రాణాలు, ఆస్తిని నష్టపోకుండా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రజల వినతులకు వేగంగా స్పందించాలన్నారు. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్‌, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సీఎంకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు.