LOADING...
Modis China visit: మోదీ పర్యటనకు ముందు.. చైనా ఎంబసీ ఆసక్తికర పోస్ట్‌
మోదీ పర్యటనకు ముందు.. చైనా ఎంబసీ ఆసక్తికర పోస్ట్‌

Modis China visit: మోదీ పర్యటనకు ముందు.. చైనా ఎంబసీ ఆసక్తికర పోస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పాటు చైనాను సందర్శించనున్నారు. అమెరికా సుంకాల మోత వేళ జరుగుతోన్న ఈ పర్యటనపై భారత్‌, చైనా నుంచి ఆసక్తి వ్యక్తమవుతోంది ఈ సందర్భంలో, ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలపై కవిత్వాత్మకంగా ఒక దృశ్యాన్ని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూజింగ్‌ తెలిపినట్లుగా,''టాంగ్ రాజవంశ కాలంలో మొగావో గుహలలో కనుగొన్న గణేశుని ప్రతిమలు ఇరుదేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న సాంస్కృతిక సంబంధాల అందమైన సూచనలు''అని పేర్కొన్నారు. ఈ చిత్రాలు షేర్ చేసినందున,మోదీ పర్యటన సందర్భంగా,దేశమంతా గణేశ్ నవరాత్రులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ పోస్టు వైరల్‌గా మారింది.

వివరాలు 

తియాన్జిన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సు

ప్రధాని మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి దిల్లీ నుండి జపాన్‌కు బయలుదేరారు. ఈ పర్యటన సెప్టెంబర్ 1 వరకు కొనసాగనుంది. ప్రారంభ రెండు రోజులు జపాన్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, తరువాత చైనాలో కొనసాగుతుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడితో సమావేశాల కోసం ప్రధాని మోదీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రకటించారు. ప్రత్యేకంగా,ఆగస్టు 31,సెప్టెంబర్ 1న తియాన్జిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొననున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపతారు.

వివరాలు 

ప్రపంచ ఆర్థికవ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్‌-చైనా కలిసి పనిచేయాలి: మోదీ 

ఎస్‌సీఓ సదస్సులో, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా 20 మందికిపైగా ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్‌-చైనా కలసి పని చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. పరస్పర గౌరవం, ఉభయ దేశాల ప్రయోజనాలు, సున్నిత అంశాల ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మకంగా, దీర్ఘకాలిక కోణంలో ముందుకు తీసుకెళ్ళడానికి భారత్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ''ఇరు దేశాలు ఇరుగుపొరుగు పెద్ద దేశాలు. వీటిమధ్య సంబంధాలు బాగుంటే, అది కేవలం ప్రాంతీయంగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా శాంతి, సుసంపన్నతలపై సానుకూల ప్రభావం చూపుతుంది'' అని ప్రధాని మోదీ అన్నారు.