
Justice Varma: జస్టిస్ వర్మ కేసు విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ గవాయ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో నోట్ల కట్టలు లభ్యమైన ఘటనకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై మోపబడిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. తాను చెప్పుకునే అవకాశం లేకుండానే చర్యలు తీసుకుంటున్నారని వాదిస్తూ జస్టిస్ వర్మ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్ విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రకటించారు. ఈ కేసు విచారణకు తానే కమిటీ సభ్యుడిగా ఉన్నందున, మరొక బెంచ్‌కు దీనిని బదిలీ చేస్తామని ఆయన వెల్లడించారు.
వివరాలు
విచారణ కమిటీలో ఉన్నందున వేరొక బెంచ్‌కు బదిలీ: గవాయ్
ఈ కేసులో పలు రాజ్యాంగ సంబంధిత సమస్యలు ఉన్నందున, వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్ వర్మ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ గవాయ్, విచారణ కమిటీలో తాను ఉన్నందున దాన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. ఇదే కేసులో ఇటీవల న్యాయవాది మాథ్యూస్ నెడుంపర, జస్టిస్ వర్మను ఏకవచనంతో సంబోధించినందుకు గవాయ్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ మూడు పిటిషన్లు దాఖలైన విషయంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ కేసు విచారణను కొనసాగించేందుకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే ప్రక్రియను సుప్రీంకోర్టు ప్రారంభించింది.
వివరాలు
జస్టిస్ వర్మను రాజీనామా చేయమని సూచించిన సీజేఐ
జస్టిస్ యశ్వంత్ వర్మ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో, ఆయన నివాస ప్రాంగణంలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ అంశంపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, విచారణకు ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నోట్ల కట్టలు దొరికిన విషయం నిజమేనని తేలింది. దీంతో జస్టిస్ వర్మను రాజీనామా చేయమని సీజేఐ సూచించారు. కానీ ఆయన రాజీనామాను తిరస్కరించడంతో, జస్టిస్ ఖన్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖలు రాసి, అభిశంసన ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా సూచించారు.
వివరాలు
ఓం బిర్లాకు పిటిషన్‌ను సమర్పించిన 145మంది ఎంపీలు
దీని అనుసరించి, జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాలు ఇచ్చారు. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు 145 మంది ఎంపీలు తమ పిటిషన్‌ను సమర్పించారు. అదే విధంగా, రాజ్యసభలో కూడా 63 మంది ప్రతిపక్ష సభ్యులు సంబంధిత నోటీసులు సమర్పించారు.