LOADING...
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నుండి మరిన్ని నిధులను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా రాష్ట్ర మంత్రులు తరచూ కేంద్రమంత్రులతో సమావేశాలు జరుపుతూ,రాష్ట్ర సమస్యలను వివరిస్తూ పరిష్కారానికి కేంద్రం సహకరించాలంటూ అభ్యర్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఆయన పలు ముఖ్యమైన కేంద్రమంత్రులను కలవనున్నారు. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కలుసుకోనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేసి, ఆర్థిక సహాయం చేయాలని ఆమెను కోరనున్నారు.

వివరాలు 

 'ఎకనమిక్ టైమ్స్' వరల్డ్ లీడర్స్ ఫోరమ్ సదస్సుకు..

అదేవిధంగా పూర్వోదయ పథకం తరహాలోని కేంద్ర కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నది ఆయన విజ్ఞప్తి. తర్వాత సాయంత్రం 3.15 గంటలకు నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఒక ప్రైవేటు హోటల్‌లో 'ఎకనమిక్ టైమ్స్' ఆధ్వర్యంలో జరగనున్న వరల్డ్ లీడర్స్ ఫోరమ్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు సమాచారం.