NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన సీఎం
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన సీఎం
    రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన సీఎం

    Chandrababu: రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన సీఎం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 04, 2024
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిరునామాను మార్చుకోనున్నారు.

    గత దశాబ్దం పాటు ఆయన కృష్ణా నది ఒడ్డున ఉన్న ఉండవల్లి కరకట్ట మార్గంలో, లింగమనేని కుటుంబానికి చెందిన అతిథిగృహంలో నివసిస్తున్నారు.

    అమరావతి నిర్మాణం ప్రారంభమైన తరువాత, తన సొంతిల్లు నిర్మించుకుంటానని ఆయన చాలాసార్లు ప్రకటించారు.

    తాజాగా, రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం.

    వివిధ ప్రాంతాల్లో తన అన్వేషణ తర్వాత, వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఆయన ఎంపిక చేశారు.

    ఈ స్థలం 25,000 చదరపు గజాలు విస్తరిస్తుంది,ఈ-6 రోడ్డుకు దగ్గరగా ఉంది.

    వివరాలు 

    ఈ స్థలంలో మట్టి పరీక్షలు

    మూడు రైతుల పేరిట ఈ స్థలం ఉందని, వారు తిరిగి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    నాలుగు వైపులా రోడ్లు ఉన్న ఈ స్థలానికి రాజధానిలో ముఖ్యమైన సీడ్ యాక్సెస్ మార్గం సమీపంగా ఉంది.

    గెజిటెడ్ అధికారులు, ఎన్జీవో నివాసాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ వంటి ముఖ్యమైన భవనాలు ఈ ప్లాట్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్లు సమాచారం.

    సుమారు 5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ స్థలంలో కొంత భాగంలోనే ఇల్లు నిర్మించి, మిగిలిన భూమిని ఉద్యానవనాలు, సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్‌ వంటి అవసరాలకు వినియోగించాలన్నది నిర్ణయం.

    ప్రస్తుతం ఈ స్థలంలో మట్టి పరీక్షలు జరుగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చంద్రబాబు నాయుడు

    AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం.. ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    CBN Tributes to Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం.. ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌ ఆంధ్రప్రదేశ్
    AP Sand Policy : ఇసుక కొరతపై సీఎం కీలక ఆదేశాలు.. ఏపీలో నూతనంగా 108 ఇసుక రీచ్‌లు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు..  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025