Page Loader
CM KCR : సీఎం కేసీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం.. సాంకేతిక లోపంతో హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్ 
CM KCR: సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం..సాంకేతిక లోపంతో హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్

CM KCR : సీఎం కేసీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం.. సాంకేతిక లోపంతో హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 06, 2023
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పెను ముప్పు తప్పింది. ఈ మేరకు సాంకేతిక లోపంతో హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. తొలుత సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్‌లో దేవరకద్రకు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లాక హెలికాప్టర్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి.దీంతో పైలట్లు తిరిగి ఫామ్‌హౌజ్‌కే మళ్లించారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో హెలికాఫ్టర్ సాంకేతిక సమస్యకు గురైంది. దీంతో సీఎం కేసీఆర్‌కు సదరు ఏవియేషన్ సంస్థ మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్‌ను అందించారు.ఫలితంగా పర్యటన యథావిధిగా కొనసాగనుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు దేవరకద్రలో, 1:30 గం గద్వాల్, 2:40 గం మక్తల్, సాయంత్రం 4 గం. నారాయణపేటలో పర్యటించాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సాంకేతిక లోపంతో KCR హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్