Page Loader
Cm Kejriwal : కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచన 
జైలుకు వెళ్లేందుకు రెఢీగా ఉండాలని కార్యకర్తలకు సూచన

Cm Kejriwal : కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచన 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jan 01, 2024
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ క్యాడర్'కు దిశానిర్దేశం చేశారు. అనవసరమైతే జైలుకు సైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజా శేయస్సు కోసం చేపట్టిన ప్రజా పోరాటం కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడంతో తమ పార్టీ ప్రజాదరణ పొందిందని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న పార్టీ నేతలను చూస్తే గర్వంగా ఉందన్నారు.

Details

ఆ పోరాట వీరులను చూసి గర్వపడుతున్నా : కేజ్రీవాల్

పిల్లలకు ఉన్నతమైన విద్య, పేదలకు ఉచిత వైద్యంపై స్పందిస్తే జైల్లో పెడుతున్నారని కానీ, అందుకు బాధపడనవసరం లేదన్నారు. ఈ రోజు జైలులో ఉన్న మన నేతలే మన హీరోలు అని అభివర్ణించారు. ఆ పోరాట వీరులను చూసి చాలా గర్వపడుతున్నానన్నారు. అయితే అందుకు మనం సిద్ధంగా ఉండాలన్నారు. ఆప్ శ్రేణులు సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోని భాజపా దర్యాప్తు సంస్థలను చేతిలోకి తీసుకుని, ఆప్ నేతలను జైలుకు పంపిందన్నారు. దేశంలోని ఏ ఇతర పార్టీలు దృష్టి సారించని సమస్యలపై తమ పార్టీ దృష్టి కేంద్రీకరించిందన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రజలకు తమ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ఆప్ తరహా రాజకీయాలను ప్రజలు ఇష్టపడుతున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు.