
Telangana: నేడు గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2, 3 ప్రాజెక్టు ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు గండిపేటలో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2, ఫేజ్-3 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 7,360 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభం కానుండగా, గోదావరి నది నుంచి నగరానికి రోజుకు 20 టీఎంసీలు నీరు తరలించే ప్రణాళిక రూపొందించారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు, మిగిలిన రెండున్నర టీఎంసీలు మూసీ ప్రక్షాళన ప్రణాళికలకు, జంట జలాశయాల పునరుజీవనానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి నగరానికి తగినంత నీటి సరఫరా కోసం వివిధ ప్రాజెక్టుల ద్వారా రోజుకు 580 నుండి 600 ఎంజీడీల నీరు అందిస్తున్నారు.
వివరాలు
డీపీఆర్ సిద్ధం చేసిన ప్రాజెక్టుకు సంబంధించి, వాప్‌కోస్ కంపెనీ
కానీ, భవిష్యత్ లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మల్లన్నసాగర్ ప్రాంతం నుంచి అదనంగా 300 ఎంజీడీల నీటిని నగరానికి పంపించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, వాప్‌కోస్ కంపెనీ డీపీఆర్ (డిజైన్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేసింది. ఘన్‌పూర్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో 1,170 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కర్మాగారాలు (Water Treatment Plants) నిర్మించనున్నారు. ఘన్‌పూర్ నుండి ముత్తంగి వరకు భారీ పైప్‌లైన్, పంప్ హౌజ్‌లు, సబ్‌స్టేషన్లు నిర్మించబడతాయి.
వివరాలు
నగరానికి ప్రతిరోజు 300 ఎంజీడీల నీటి సరఫరా
ప్రజలకు తాగునీటి సరఫరా పెంచే ఉద్దేశ్యంతో, ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలని, ప్రతిరోజు 300 ఎంజీడీల నీటిని నగరానికి సరఫరా చేయాలని అధికారులు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తైన తరువాత నగర ప్రజలకు శుద్ధమైన, పరిమితమైన నీటి సమస్య తగ్గడంతో పాటు, నీటి వినియోగం మెరుగుపడనున్నది.