Revanthreddy: తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రివర్గంలో ఎవరు ఉండాలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని, తాను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదని చెప్పారు.
ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్లామని, వారిని త్వరగా అరెస్టు చేయించి జైలుకు పంపించాలనే ఆలోచన తమకు లేదన్నారు.
సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కులగణన సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు.
ఈ సర్వే ద్వారా ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు ఆయన తెలిపారు.
Details
తెలంగాణ 2
పీసీసీ కార్యవర్గ కూర్పు పూర్తయిందని, దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ను తాను కోరలేదని, తెలియనివారు మాట్లాడితే తనకేంటి సంబంధమన్నారు.
ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్ఠానం పరిధిలోనే ఉంటాయన్నారు. తాను ఎప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోనని, పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు.
ప్రతి విమర్శకూ తాను స్పందించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులగణన సర్వే ప్రకారం బీసీ జనాభా ఐదున్నర శాతం పెరిగిందని తెలిపారు.
ఈ లెక్కలు పరిశీలించిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో దీనిని అంగీకరించారని సీఎం వెల్లడించారు.