Telangana: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ,వారికి రాజకీయంగా అనేక అవకాశాలను అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈబిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వివిధఅంశాలను స్పష్టంగా వివరించారు.
''దళితుల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందంజలో ఉంది.బాబూ జగ్జీవన్ రామ్‌కు కేంద్ర మంత్రిత్వ బాధ్యతలు అప్పగించి గౌరవించటం జరిగింది.అంతేకాకుండా,దామోదరం సంజీవయ్యను దేశంలో తొలి ఎస్సీ సీఎంగా ఎంపిక చేయడం కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైంది.గతంలో ఉమ్మడిరాష్ట్రంలో ఎస్సీవర్గీకరణ కోసం సాగిన పోరాటంలో ఎందరోజీవితాలను అర్పించారు.
ఈసమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో భాగంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉషామెహ్రా కమిటీని ఏర్పాటు చేసింది.
వివరాలు
ఎస్సీ ఉపకులాలను మూడు వర్గాలుగా విభజించేందుకు కమిషన్ సిఫార్సు
తాజాగా,సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తగిన చర్యలు తీసుకున్నాం.
వెంటనే ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం.
ఆ ఉపసంఘం సూచనల మేరకు షమీమ్ అక్తర్ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ఈ కమిషన్ ప్రజల నుండి 8,681 సూచనలను స్వీకరించి, పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది.
కమిషన్ నివేదికలో సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి మార్పులు చేయకుండా ఆమోదించాం.
మొత్తం 59 ఎస్సీ ఉపకులాలను మూడు వర్గాలుగా విభజించేందుకు కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ వర్గీకరణ గతంలో ఆయా కులాలకు లభించిన ప్రయోజనాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది,'' అని సీఎం వివరించారు.
శాసనసభలో ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.