Page Loader
Cm Revanth Reddy: 17న మళ్లీ దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం 
17న మళ్లీ దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం

Cm Revanth Reddy: 17న మళ్లీ దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2024
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇప్పటికే ఆయన రాక కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలకు ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన పది రోజుల పాటు విదేశాల్లో ఉండగా, ఇవాళ తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.

Details

పీసీసీ చీఫ్ నియామకంపై పార్టీ పెద్దలతో సమావేశం

అయితే తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి ఈనెల 17న వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. తెలంగాణ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీలో జరిగే సమావేశంలో ఆయా అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.