ముఖ్యమంత్రి నివాసంలోకి బాధితుడు దశమత్ రావత్.. కాళ్లు కడిగిన సీఎం చౌహాన్
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన ఘటనతో మధ్యప్రదేశ్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ మేరకు బాధితుడు దశమత్ రావత్ ను భోపాల్ లోని తన అధికార నివాసానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆహ్వానించారు. అనంతరం ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ అతడి పాదాలను కడిగారు. మరోవైపు ముత్ర విసర్జనను హేయమైన చర్యగా చౌహాన్ అభివర్ణించారు.ఈ మేరకు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అంతకుముందు సిద్ది వీడియో వైరల్ కావడంతో నిందితుడిపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది.ప్రవేశ్ శుక్లా నివాసాన్ని స్థానిక అధికారులు ఇప్పటికే కూల్చివేశారు. జులై 5న అర్థరాత్రి నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దశమత్ రావత్ కాళ్లు కడుగుతున్న సీఎం చౌహాన్
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal. In a viral video from Sidhi, accused Pravesh Shukla was seen urinating on Rawat. Shukla was arrested on 5th July and his illegal construction was demolished by the... pic.twitter.com/YluT3Pj2Gl— ANI (@ANI) July 6, 2023