Telangana: రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర బొగ్గుశాఖ
రాబోయే ఐదేళ్లలో సింగరేణి సంస్థ ఏడు కొత్త గనులను ప్రారంభించి, బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదలపై ఆ శాఖ తాజా నివేదికను పార్లమెంటుకు అందజేసింది. ఆ నివేదిక ప్రకారం, సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి అధికంగా పెరిగినట్లు కాదు. 2021-22లో 67.23 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసిన సింగరేణి, 2023-24లో 72.52 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. ఈ సమయంలో 7.86% వృద్ధి నమోదు అయినప్పటికీ, ఒడిశాలో 29.41% వృద్ధి నమోదవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో రికార్డు స్థాయిలో 34.47% వృద్ధి నమోదు చేయగా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ముందడుగులో నిలిచాయి.
కొత్త గనులను త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు
సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గిన కారణాలుగా, కార్మిక సంఘాలు పలు అంశాలను పేర్కొన్నాయి. ముఖ్యంగా, కేంద్రం గత ఐదేళ్లుగా నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని కోరినా స్పందించకపోవడం, భూగర్భ గనుల్లో కార్మికుల, యంత్రాల పూర్ణ పనితీరు లేకపోవడం, అధిక వర్షాలతో ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,సింగరేణి సంస్థ కొత్త గనులను త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ప్రారంభించే గనుల ద్వారా 100లక్షల టన్నులు,40లక్షల టన్నులు, 20 లక్షల టన్నులు, 35 లక్షల టన్నులు అదనంగా ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డి, సింగరేణి కార్మిక సంఘాలు, అధికారులు మరిన్ని కొత్త గనులను కేటాయించేందుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.