Page Loader
Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ? 
Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?

Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ? 

వ్రాసిన వారు Stalin
Jan 27, 2024
07:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ సీఎం నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరుకున్నారన్న వార్తల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. అయితే ఇప్పుడు నితీష్ కుమార్ కూటమి మార్పు అంశం.. కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. బిహార్‌లో 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నితీష్ నేతృత్వంలోని జేడీయూతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 29నుంచి బిహార్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు పూర్నియాలో కాంగ్రెస్ కీలక సమావేశాన్ని శనివారం నిర్వహించింది. కాంగ్రెస్ నిర్వహించిన కీలక సమావేశానికి 19మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6 మంది మాత్రమే హాజరు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బిహార్

 గోపాల్ మండల్ వ్యాఖ్యలతో ప్రచారానికి బలం

సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలకు ఫొన్ చేసినా.. స్విచాఫ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు సగానికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడీయూలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలోని తమ పార్టీలోకి లాగే ప్రయత్నస్తున్నట్లు చేస్తున్నారట. జేడీయూకి చెందిన ప్రముఖ నేత ఎమ్మెల్యే గోపాల్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. గోపాల్ మండల్ మీడియాతో మాట్లాడుతూ.. జేడీయూ ఎమ్మెల్యేల సంఖ్య పెరగబోతోందని ఆయన చెప్పడం వెనుక మతలబు ఇదేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ముందు నెలకొన్న గందరగోళ పరిస్థితులు కాంగ్రెస్ ఎదురుదెబ్బే అని చెప్పాలి.