ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ కు అధికారంపైనా, ప్రధాని మంత్రి పదవి పైనా ఆసక్తి లేదని, కేవలం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం , సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయిలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమేనని, కానీ అవి సిద్ధాంతపరమైన కావని, దేశం కోసం ఎదుర్కొంటున్న సమస్యలు ముందు ఇవి పెద్ద విషయాలు కావని మల్లికార్జున ఖర్గే చెప్పారు.
Detaiils
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకమైన నిర్ణయాలు
11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారంలోకి ఉన్నాయని, ఈ దఫా బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించలేదని పేర్కొన్నారు. బీజేపీ ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని భాజపా వదిలేస్తుందని ఆయన ఆరోపించారు.
కర్ణాటకలోని బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సమావేశమైన విషయం తెలిసిందే. అయితే రెండో రోజైన మంగళవారం కూడా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఈ సమావేశంలో వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకున్నారు.
ఈ సమావేశంపై స్పందించిన ప్రధాని మోదీ సొంత ప్రయోజనాల కోసం కొందరు ఏకమయ్యారని, అది అవినీతిపరుల సదస్సు అని విమర్శలు గుప్పించారు.