Jairam Ramesh: కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు.. తోసిపుచ్చిన ఈసీ
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన ప్రకారం, ఈసీఐ వెబ్‌సైట్ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ను తప్పుదారి పట్టిస్తోంది. అప్‌డేటెడ్ ట్రెండ్స్‌ను ఈసీ చాలా నెమ్మదిగా అప్‌లోడ్ చేస్తున్నదని ఆయన విమర్శించారు.
"పాత, తప్పుదారి పట్టించే సమాచారాన్ని షేర్ చేయాలని అధికార యంత్రాంగంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందా?" అని అనుమానం వ్యక్తం చేశారు.
వారు ఈసీకి మెమొరాండం సమర్పించబోతున్నట్లు, అలాగే ఫిర్యాదు చేస్తామని,తమ ప్రశ్నలకు ఈసీ సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
10-11 రౌండ్ల ఫలితాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, ఈసీ వెబ్‌సైట్ 4-5 రౌండ్ల ఫలితాలనే మాత్రమే అప్‌లోడ్ చేసింది.
వివరాలు
ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
అయితే, జైరామ్ రమేశ్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
ఈసీ వాటిని "పూర్తిగా ఊహాజనిత,బాధ్యతారహితమైనది" అని వ్యాఖ్యానించింది. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించకూడదని తేల్చి చెప్పింది.