Page Loader
Bandru Shobharani: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చెప్పు దెబ్బలు తింటావ్.. శోభారాణి
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చెప్పు దెబ్బలు తింటావ్.. శోభారాణి

Bandru Shobharani: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చెప్పు దెబ్బలు తింటావ్.. శోభారాణి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2024
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రాజకీయ వేదికపై మరోసారి విమర్శలు, ప్రతివిమర్శలు వివాదాస్పదంగా మారాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ నేత పీ. కౌశిక్‌ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకురాలు బండ్రు శోభా రాణి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చీరలు, గాజులు వేసుకుని తిరగాలని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నాయకురాలు బండ్రు శోభా రాణి ఘాటుగా బదులిచ్చారు.

Details

అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్

మహిళలను అవమానిస్తే పాదరక్షలతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చీర, గాజులకు ప్రతిగా తమ పాదరక్షలతో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఫిరాయించిన 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై కూడా బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లోగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.