
Sonia Gandi : సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి అస్వస్థకు గురయ్యారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో దిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో ఆమె చేరారు.
సోనియా గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఈ ఏడాదిలో పలు ఆరోగ్య సమస్యల వల్ల సోనియా గాంధీ రెండు సార్లు ఆస్పత్రిలో చేరడం గమనార్హం. ప్రస్తుతం సోనియా గాంధీని అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు.
Details
నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం
వైరల్ రెస్పటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12, 2023న సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ జనవరి 17న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత మార్చి 2న జ్వరం కారణంగా ఆమె అదే ఆస్పత్రిలో చేరారు.
తాజాగా మరోసారి సోనియా గాంధీ అనారోగ్యం భారీన పడటంతో కాంగ్రెస్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ప్రస్తుతం ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ముంబై వేదికగా ఈ కూటమి ఆగస్టు 31న నిర్వహించిన సమావేశానికి సోనియా గాంధీ హజరైన విషయం తెలిసిందే.