Page Loader
ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది
కోరమండల్ ఎక్స్ ప్రెస్ రాంగ్ ట్రాక్ తీసుకుంది : రైల్వే

ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 03, 2023
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పక్క ట్రాక్‌లోకి మారింది. దీని ఫలితంగానే ఈ దారుణం సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది. ఖరగ్‌పూర్ రైల్వే డివిజన్‌లోని సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన వీడియోలో ఈ విషయం స్పష్టమైంది. అయితే ఈ ఘటనకు గల పూర్తి వివరాలు, మరింత సమాచారం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తెలియనుందని అధికార వర్గాలు అంటున్నాయి. యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది : ఫిరోజాబాద్‌లో 1995లో 3 రైళ్లు ఢీకొన్న ఘటనలో 350 మంది మరణించారని రైల్వే అధికారి గుర్తుచేశారు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంచుమించుగా 300 దాటడం దేశ రైల్వే చరిత్రలోనే ఓ పెను విషాదంలా మారింది.

Coromandal Express

రైలు మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ తీసుకుంది : అధికారులు 

చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 6:55 గంటలకు బహానగర్ బజార్ స్టేషన్ దాటిన తర్వాత మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌ను తీసుకుందని సదరు అధికారి తెలిపారు. లూప్ లైన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టి పట్టాలు తప్పి మెయిన్ లైన్ లో పడిందని వివరించారు. అనంతరం మెయిన్ లైన్ లో ఎదురుగా వస్తూ హౌరా వెళ్తున్న యశ్వంత్‌ పూర్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను వేగంగా ఢీకొట్టింది. ఏది ఏమైనా పూర్తి స్థాయి విచారణలోనే ప్రమాదానికి గల అసలు కారణం తెలుస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.