Page Loader
Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!

Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో కోవిడ్‌ మహమ్మారి మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది. తాజాగా వెలువడిన కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 6,133కు చేరింది. జూన్‌ 8న ఉదయం 8 గంటల వరకు నమోదైన డేటా ప్రకారం, గత 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదవగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 65కు చేరింది.

Details

కేరళలో అత్యధిక కేసులు 

రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలోనే అత్యధికంగా 1,950 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ రాష్ట్రం తర్వాత గుజరాత్‌లో 822, పశ్చిమ బెంగాల్‌లో 693, దిల్లీలో 686 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఉత్తరప్రదేశ్‌లో 219, తమిళనాడులో 194, రాజస్థాన్‌లో 132, హరియాణాలో 102 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి.

Details

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంది 

ఆంధ్రప్రదేశ్‌లో 86, బిహార్‌లో 49, ఛత్తీస్‌గఢ్‌లో 41, మధ్యప్రదేశ్‌లో 39, పంజాబ్‌లో 35, ఒడిశాలో 33, సిక్కింలో 23, పుదుచ్చేరిలో 15, తెలంగాణలో 10 కేసులున్నాయి. అలాగే జమ్మూ కశ్మీర్‌, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో రాష్ట్రంలో తొమ్మిది చొప్పున కేసులు ఉన్నాయి. ఇక అస్సాంలో 6, ఝార్ఖండ్‌లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 3, చండీగఢ్‌లో 2, త్రిపురాలో ఒక్క కేసు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌, మిజోరాంలలో ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Details

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచడం, గుంపులు గుమిగూడే ప్రాంతాల్లో ఉండకపోవడం వంటి మౌలిక జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.