Page Loader
చెన్నై: నడిరోడ్డుపై అగ్గిపాలైన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. భారీగా ట్రాఫిక్ జామ్ 
చెన్నై రోడ్ల మీద కాలిపోయిన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు

చెన్నై: నడిరోడ్డుపై అగ్గిపాలైన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. భారీగా ట్రాఫిక్ జామ్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 25, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. అత్యంత రద్దీ గల రోడ్డులో ఖరీదైన కారు మంటల్లో దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అరుణ్ బాలాజీ(37 ఏళ్లు) బీఎండబ్ల్యూ కారులో తిరువల్లికేణి నుంచి తిండివనం ప్రాంతానికి ప్రయాణిస్తున్నాడు. కారు క్రోంపేటకు సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ పార్థసారధి హుటాహుటిన కారును ఆపేశాడు. కిందకు దిగి ఏమైందో పరిశీలించే లోగా క్షణాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఖరీదైన కారు మంటలకు ఆహుతైపోయిందని స్థానికులు చెప్పారు. ఘటనతో గంటపాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాలిపోతున్న బీఎండబ్ల్యూ కారు