Wayanad tragedy: వయనాడ్ విషాదానికి గోహత్యలే కారణం.. బీజేపీ నేత సంచలన ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని వయనాడ్ కొండచరియలు విరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇప్పటికే ఈఘటనలో 360 మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్కూ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అందరి హృదయాలను కలిచివేస్తున్న ఈ ప్రమాదంపై రాజస్థాన్ సీనియర్ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ దుర్ఘటనకు గోహత్యే కారణమని రాజస్థాన్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజా ఆరోపించారు.
Details
కేరళలో గోహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి
కేరళలో గోహత్య విపరీతంగా జరుగుతోందని, అందుకే అక్కడ కొండచరియలు విరిగిపడి, ఇలాంటి విధ్వంసాలు చోటు చేసుకున్నాయన్నారు.
కేరళలో గోహత్యలు ఆపకపోతే ఇటువంటి విషాదాలు కొనసాగుతాయని అల్వార్‌లోని సర్క్యూట్ హౌస్‌లో అహుజా విలేకరులతో అన్నారు.
ఉత్తరాఖండ్ , హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయని, అయితే వయనాడ్ పరిమాణంలో విపత్తులకు దారి తీయలేదన్నారు.
2018 నుండి గోహత్లో పాల్గొన్న ప్రాంతాలు అటువంటి విషాధ ఘటనలను ఎదుర్కొనే నమూనాను తాము గమనించామని అహుజా వెల్లడించారు.