Cyclone: కోల్‌కతాకు తుఫాన్ హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ.. మరో 18 రాష్ట్రాలకు కూడా
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతాకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇరాక్-బంగ్లాదేశ్ కేంద్రంగా ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ సహా మరో 18 రాష్ట్రాల్లో వర్షపాతం సంభవించే అవకాశముందని తెలిపింది.
ఈ తుఫాన్ ప్రభావం కారణంగా ఉత్తర భారతదేశంతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి.
అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షపాతం చోటుచేసుకోవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
మార్చి 15 వరకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మంచు వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మార్చి 13న పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అలాగే మార్చి 15 వరకు రాజస్థాన్‌లోనూ వర్షపాతం కొనసాగుతుందని వెల్లడించింది.
వివరాలు
అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం
తూర్పు భారతదేశంలోని బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపురల్లో మార్చి 15 వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం సంభవించవచ్చని హెచ్చరించింది.
దక్షిణాది రాష్ట్రాల్లోనూ వాతావరణ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చరించింది.
వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా మారితే స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి.
ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని వాతావరణ శాఖ సూచించింది.