Page Loader
Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్ 
పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్

Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' విషయం మనందరికి తెలిసిందే. ఈ చర్యకు ప్రతీకారంగా భారత్‌లోని సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు పాకిస్తాన్‌ యత్నించింది. అయితే, భారత భద్రతా దళాలు ఆ యత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనాన్ని బలహీనతగా భావిస్తే, 'ఆపరేషన్‌ సిందూర్‌' తరహా చర్యలకు భారత్‌ వెనుకాడదని ఆయన హెచ్చరించారు. 'నేషనల్‌ క్వాలిటీ కాంక్లేవ్‌' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, దేశ భద్రత విషయంలో భారత్‌ ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడదని స్పష్టం చేశారు.

వివరాలు 

ఉగ్రవాద స్థావరాలను భారత్‌ సమర్థవంతంగా నాశనం చేసింది 

"మేము ఎప్పుడూ శాంతిని, సంయమనాన్ని ప్రాముఖ్యత ఇస్తాం.చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అనే నమ్మకంతో వ్యవహరిస్తాం. అయితే దీన్ని మా సహనాన్ని పరీక్షించే అవకాశంగా తీసుకోవడం సరైంది కాదు. ఎవరైనా భారత్‌ ఓర్పును తక్కువగా అంచనా వేస్తే, ఆపరేషన్‌ సిందూర్‌ లాంటి చర్యల పరిణామాలకు సిద్ధంగా ఉండాలి," అని రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ అమలులో భారత బలగాలు అత్యుత్తమ ప్రణాళికతో, అద్భుతమైన ఖచ్చితత్వంతో ముందడుగు వేశాయని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో పాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్‌ సమర్థవంతంగా నాశనం చేసిందని వెల్లడించారు.

వివరాలు 

భారత సాయుధ దళాల ధైర్యాన్ని ప్రశంసించిన మంత్రి 

ఈ దాడుల్లో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం గలవంతమైన ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించిందని ఆయన కొనియాడారు. సామాన్య ప్రజలకు ఏ విధమైన హాని జరగకుండా ఈ చర్యను విజయవంతంగా నిర్వహించామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాల వినియోగం, అత్యుత్తమంగా శిక్షణ పొందిన సైనికుల సమర్థత కారణంగానే ఈ విజయం సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్