Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. పాక్ పొగతో మరింత ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ దేశ రాజధాని దిల్లీని మరోసారి వాయు కాలుష్యం కమ్మేసింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 300 మార్కును దాటడంతో గాలి నాణ్యత 'వెరీ పూర్' (అత్యంత పేలవం) స్థాయికి పడిపోయింది. దీపావళికి కొద్ది రోజుల ముందే కాలుష్యం ఈ స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోని పంజాబ్, హర్యానాతో పాటు పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వ్యవసాయ వ్యర్థాలను పెద్ద ఎత్తున తగలబెట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఉపగ్రహాల నుంచి సేకరించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. అక్టోబర్ 1 నుంచి 29 వరకు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 13,241చోట్ల వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టినట్లు గుర్తించారు.
వివరాలు
కాలుష్యానికివ్యవసాయ వ్యర్థాల పొగ కూడా తోడవడంతో..
ఇదే సమయంలో భారత పంజాబ్‌లో 3,158 దహనాలు నమోదయ్యాయి. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులు ఈ ప్రాంతాల్లోని పొగను ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధికి తీసుకొస్తున్నాయి.
మరోవైపు, ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలి వేగం మందగించడం వల్ల కాలుష్య కారకాలు వాతావరణంలోనే పేరుకుపోతున్నాయి.
స్థానికంగా వెలువడుతున్న కాలుష్యానికి వ్యవసాయ వ్యర్థాల పొగ కూడా తోడవడంతో ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది.
వివరాలు
జీఆర్ఏపీ రెండో దశను అమల్లోకి..
కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) రెండో దశను అమల్లోకి తీసుకొచ్చారు.
ఇందులో భాగంగా రోడ్లపై నీటిని చల్లడం, యాంటీ స్మాగ్ గన్‌లను వినియోగించడం, నిర్మాణ కార్యకలాపాలపై కఠిన నిఘా పెట్టడం వంటి చర్యలను ముమ్మరం చేశారు.
రాబోయే రోజుల్లోనూ గాలి నాణ్యత ఇదే స్థాయిలో కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.