Delhi Elections: ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
70 శాసనసభ స్థానాలున్న దిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుండగా, ఫలితాలను కూడా అదే రోజున వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
దిల్లీ ఎన్నికల తేదీలు
నోటిఫికేషన్ విడుదల: జనవరి 10
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: జనవరి 17
నామినేషన్ల పరిశీలన: జనవరి 18
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: జనవరి 20
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 5
ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 8
Details
ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం
దిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నట్లు సీఈసీ పేర్కొంది. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచనున్నారు. 85 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేయే సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని కోర్టులు ఇప్పటికే 42 సార్లు తీర్పులు ఇచ్చాయని సీఈసీ అన్నారు. ట్యాంపరింగ్ ఆరోపణలు అర్థం లేని వాటిగా పేర్కొన్నారు.
పోలింగ్ శాతాన్ని సాయంత్రం 5 గంటల తర్వాత మార్చవచ్చని చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు, ఎవ్వరూ పోలింగ్ శాతాన్ని మార్చలేరని స్పష్టం చేశారు.