
BJP: దిల్లీ సీఎంపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు.. రూ.5 లక్షలతో పోలీసులకు చిక్కిన పీఏ
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, బీజేపీ నేతలు ఢిల్లీ సీఎం ఆతిశీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమె సహాయకుడు రూ.5 లక్షలతో పట్టుబడినట్టు బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ వెల్లడించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. "ఢిల్లీ సీఎం ఆతిశీ పీఏ గిరిఖండ్ నగర్‌లో రూ.5 లక్షలతో పట్టుబడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. కల్కాజీలో ఓటర్లకు డబ్బు పంపిణీకి కుట్ర జరుగుతోంది" అని మాలవీయ పేర్కొన్నారు.
వివరాలు
ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ
సీఎం ఆతిశీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ప్రవహిస్తున్న యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం విషాన్ని కలుపుతోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. 70 అసెంబ్లీ స్థానాలకు ఒక్కదఫా పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 30,000 మంది పోలీసులు, 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు.