Page Loader
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా

వ్రాసిన వారు Stalin
Mar 04, 2023
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను శనివారం దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజలు కస్టడీ ముగిసిన నేపథ్యంలో సిసోడియాకు బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు దాఖలు చేశారు. ఇప్పటికే కేసుకు సంబంధించి అన్ని రకాల రికవరీల చేసినట్లు ధర్మాసనం ఎదుట న్యాయవాది పేర్కొన్నారు. మనీష్ సిసోడియాను కస్టడీలో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.

దిల్లీ

సీబీఐకి నోటీసులు జారీ చేసిన రోస్ అవెన్యూ కోర్టు

విచారణ సందర్భంగా సిసోడియాకు మరో మూడు రోజుల రిమాండ్ విధించాలని సీబీఐ కోరింది. రిమాండ్ పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను మనీష్ సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ వ్యతిరేకించారు. సీబీఐ రిమాండ్ పొడిగింపు కోరడం సమంజసం కాదన్నారు. ఇదిలా ఉంటే సిసోడియాకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదో చెప్పాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కోర్టు నోటీసులు జారీ చేసింది. దిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో సిసోడియా రోస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.