Delhi Pollution : డేంజర్ 'జోన్'లోకి దిల్లీ.. 'తీవ్రమైన' కేటగిరిలో గాలి నాణ్యత
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ మేరకు మంగళవారం పేలవమైన కేటగిరిలో ఉన్న AQI, బుధవారం (Severe) కేటగిరిలోకి పతనమైంది.
ఈ మేరకు వాయు కాలుష్యంతో మొత్తం గాలి నాణ్యత AQIతో 421 వద్ద తీవ్రమైన కేటగిరీలోకి దిగజారిపోయింది.స్వల్పంగా మెరుగుపడిన ఒక రోజు తర్వాత, దిల్లీలో మొత్తం గాలి నాణ్యత మరింత క్షీణించింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం,నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) ఉదయం 7 గంటలకు 421 వద్ద నమోదైంది.
ఈ క్రమంలోనే లోడి రోడ్, JLN స్టేడియం, సిరి ఫోర్ట్, అరబిందో మార్గ్ మరియు దిల్షాద్ గార్డెన్ వంటి స్టేషన్లు మినహా మిగతా స్టేషన్లో 'తీవ్రమైన' AQI నమోదైంది.
details
దీపావళికి ముందే తీనవ్ర స్థాయిలోకి వాయు కాలుష్యం
ఆనంద్ విహార్, ద్వారకా, షాదీపూర్, మందిర్ మార్గ్, ITO, RK పురం, పంజాబీ బాగ్, నార్త్ క్యాంపస్, మథుర రోడ్, రోహిణి, పట్పర్‌గంజ్, ఓఖ్లా, ఇండియా గేట్ ఉదయం 6 గంటలకు 400 కంటే ఎక్కువ రికార్డు అయ్యాయి.
ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 452, ఆర్‌కే పురంలో 433, పంజాబీ బాగ్‌లో 460, ఐటీఓలో 413గా నమోదైంది. ఇంతలో, జాతీయ రాజధాని ప్రాంతం(NCR), గ్రేటర్ నోయిడా AQI 474తో 'అత్యంత కాలుష్యం'గా ఉంది.
మరోవైపు ముంబైలో పరిస్థితి మెరుగ్గా లేదు. బాంద్రా కుర్లా కాంప్లాక్స్ వద్ద AQI 200 వద్ద ఉంది. మంగళవారం రాత్రి 10 గంటలకు దిల్లీ ఆనంద్ విహార్‌లో (AQI) దీపావళికి ముందే 'అత్యంత తీవ్ర' స్థాయికి 999కి చేరుకుంది.
DETAILS
కాలుష్యం కారక రాష్ట్రాలపై సుప్రీం ఫైర్
అధ్వాన్నంగా మారిన గాలి నాణ్యతపై సుప్రీంకోర్ట్ రాష్ట్రాలపై మండిపడింది. దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్రమైన నేపథ్యంలో కర్రలను, గడ్డిని కాల్చడాన్ని నిలిపివేయాలని పంజాబ్, దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్,రాజస్థాన్ లను ఆదేశించింది.
వ్యవసాయ మంటలను ఆపాలని పంజాబ్‌ను అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ పంటకు(వరి) మారడానికి సహాయం చేయాలని కేంద్రం తరపున న్యాయవాదిని సూచించింది.
మీకు అధికారులందరూ ఉన్నారని నాకు తెలియదు, దీనిపై మాకు సహనం శూన్యమని జస్టిస్ కౌల్ అన్నారు.బాణాసంచాలో నిషేధిత రసాయనాలను ఉపయోగించకూడదని దిల్లీ సహా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయన్నారు.
కొన్ని పటాకుల వినియోగాన్ని నిషేధిస్తూ, వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలన్న తీర్పును అమలు చేసేలా రాజస్థాన్‌ను ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం స్పష్టత వచ్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
AIR POLLUTION : దారుణ పరిస్థితుల్లో దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం
#WATCH | Delhi air quality continues to remain in the 'severe' category as per the Central Pollution Control Board
— ANI (@ANI) November 8, 2023
(Visuals from Kartavya Path, shot at 8.50 am today) pic.twitter.com/q8DXmNA4FS