Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు జారీ
ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీపై ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కేసులో బీజేపీ నాయకుడు సురేష్ కరంషి నఖువా, ధ్రువ్ రాఠీపై ఫిర్యాదు చేశారు. దీంతో యూట్యూబర్‌కి కోర్టు సమన్లు జారీ చేసింది. జిల్లా న్యాయమూర్తి గుంజన్ గుప్తా జూలై 19న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ కేసు విచారణ ఆగస్టు 6న జరగనుంది.
అంజలి బిర్లాపై వివాదాస్పద పోస్ట్ చేసినందుకు కేసు నమోదు
ధృవ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్‌లో జూలై 7, 2024న ఓ పోస్టు చేశారని బిజెపి ముంబై యూనిట్ అధికార ప్రతినిధి నఖువా చెప్పారు. అందులో తనని ట్రోల్ చేసి, తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారని నఖువా పేర్కొన్నారు. ఈ కేసుతో పాటు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లాపై వివాదాస్పద పోస్ట్ చేసినందుకు రాఠీ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీనిపై మహారాష్ట్ర నోడల్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.