తదుపరి వార్తా కథనం
Kishan Reddy: ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి : కిషన్ రెడ్డి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 16, 2025
11:53 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై మాత్రం కేవలం ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన విమర్శించారు.
హనుమకొండలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
2014 తర్వాత మండలిని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు.
పోరాటం చేసే నాయకులను పక్కనపెట్టి, తమకు మద్దతుగా ఉన్న వారినే ఎంపిక చేసుకుంటూ, స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.