
Bihar: బిహార్‌లో ట్రంప్ నివాసం! ..అమెరికా అధ్యక్షుడి పేరుతో నివాస ధృవీకరణ పత్రం
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాష్ట్రంలోని సమస్తీపుర్ జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నివాస ధృవీకరణ పత్రం కోసం చేసిన దరఖాస్తు,సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ దరఖాస్తు మొహియుద్దీన్‌నగర్ బ్లాక్‌కు చెందిన ప్రభుత్వ వెబ్‌పోర్టల్‌లో ట్రంప్ పేరు,ఫోటో సహా ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అభ్యర్థనను వెంటనే తిరస్కరించడమే కాకుండా,ఐటీ చట్టం ప్రకారం కేసును నమోదు చేసి, దర్యాప్తును సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగించారు. బిహార్‌లో గత కొన్నిరోజులుగా ఇటువంటి 'అపహాస్య'దరఖాస్తులు చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. గతంలో కుక్క పేరుతో ఒక దరఖాస్తు దాఖలవ్వగా,ఆ తరువాత ట్రాక్టర్ పేరుతో మరొకటి వచ్చింది. ఇప్పుడు అయితే నేరుగా డొనాల్డ్ ట్రంప్ పేరును వాడారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డొనాల్డ్ ట్రంప్ పేరుతో నివాస ధృవీకరణ పత్రం
#WATCH | Bihar | An application was given in Samastipur to make a residence certificate in the name of US President Donald Trump. (06/08) pic.twitter.com/SfW3dtPf2W
— ANI (@ANI) August 6, 2025