NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / EC: ఎగ్జిట్ పోల్స్ తప్పుగా ఉంటే ఈవీఎంలను ఎందుకు నిందిస్తారు?విమర్శలపై ఈసీ ఫుల్ క్లారిటీ
    తదుపరి వార్తా కథనం
    EC: ఎగ్జిట్ పోల్స్ తప్పుగా ఉంటే ఈవీఎంలను ఎందుకు నిందిస్తారు?విమర్శలపై ఈసీ ఫుల్ క్లారిటీ
    EC: ఎగ్జిట్ పోల్స్ తప్పుగా ఉంటే ఈవీఎంలను ఎందుకు నిందిస్తారు?విమర్శలపై ఈసీ ఫుల్ క్లారిటీ

    EC: ఎగ్జిట్ పోల్స్ తప్పుగా ఉంటే ఈవీఎంలను ఎందుకు నిందిస్తారు?విమర్శలపై ఈసీ ఫుల్ క్లారిటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 15, 2024
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తాయని సూచించినా, చివరికి బీజేపీ విజయం సాధించింది.

    ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అనేక ఆరోపణలు, అనుమానాలను ఈవీఎంలపై వ్యక్తం చేస్తోంది.

    వారు పలు రకాల ఫిర్యాదులు చేసారు, ''ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం'' అని పేర్కొంటున్నారు.

    ఈ ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు.

    మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

    వివరాలు 

    ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడం కరెక్ట్ కాదు: రాజీవ్ కుమార్

    ''ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమిషన్‌కు ఏమి సంబంధమని'' రాజీవ్ కుమార్ ప్రశ్నించారు.

    ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు.ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ, తర్వాత బీజేపీకి అనుకూలంగా మారడం కూడా ఈవీఎంలపై వస్తున్న విమర్శలకు సంబంధించిందని అన్నారు.

    కౌంటింగ్ ప్రారంభం అయ్యే వరకూ అధికారిక సమాచారం లభించకపోవడాన్ని ఆయన గుర్తించారు.

    ఉదయం 9:30 వరకు కౌంటింగ్ ప్రారంభించిన గంటన్నర వరకు మీడియాలో ప్రచారం చేయబడిన సంఖ్యలు అధికారికం కాదని స్పష్టం చేశారు.

    ఎగ్జిట్ పోల్స్, ఆధారం లేని వార్తలను పట్టుకుని ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడం కరెక్ట్ కాదని సీఈసీ చెప్పారు.

    విమర్శలు, ఆరోపణలపై స్వీయ నియంత్రణ పాటించాలని రాజకీయ పార్టీలను ఆయన కోరారు.

    వివరాలు 

    ఈవీఎంలు 100 శాతం ఫుల్‌ప్రూఫ్‌.. అవి ట్యాంపర్ చేయలేరు: రాజీవ్ కుమార్

    ''ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రజలే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు'' అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

    ఈవీఎంలు 100 శాతం ఫుల్‌ప్రూఫ్‌గా ఉన్నాయని, అవి ట్యాంపర్ చేయలేనని ఆయన చెప్పారు.

    హర్యానా ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల విషయంలో అనుమానాలు వ్యక్తం చేసేవారు మరింత పెరిగారు.

    అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో, బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని అనుకున్నారు.

    ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు, పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయి.

    ఓ దశలో 90 స్థానాల్లో 70కి పైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా, తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించడం ప్రారంభించినప్పుడు బీజేపీ లీడింగ్‌లోకి వచ్చింది.

    వివరాలు 

    హర్యానా ప్రజలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు 

    రాజకీయ పార్టీలు మాత్రమే ఈ అంశంపై ఆరోపణలు చేస్తున్నాయి. హర్యానాలో ఓట్లు వేసిన ప్రజలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.

    అంతా ఏకపక్షంగా కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఉంటే, వారు ఖచ్చితంగా తమ అభిప్రాయాలను తెలియజేస్తారు.

    కానీ రాజకీయ పార్టీలు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఫలితాలు తారుమారయ్యాయని వాదించడం ప్రారంభించారు. ఈసీ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం

    తాజా

    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ
    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  ఆంధ్రప్రదేశ్

    ఎన్నికల సంఘం

    Model Code Of Conduct: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఇది ఎవరికి వస్తుంది!  ఎన్నికలు
    Telangana vote: తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు.. మే 13 పోలింగ్ తెలంగాణ
    PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ  నరేంద్ర మోదీ
    KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి  లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025