NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sridhar Babu: తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు  
    తదుపరి వార్తా కథనం
    Sridhar Babu: తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు  
    తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు

    Sridhar Babu: తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు.

    హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న 'గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌ 2024' ప్రారంభ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

    ఈ సందర్భంగా, హైదరాబాద్‌ను ఏఐ డెస్టినేషన్‌గా మార్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

    200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని నిర్మిస్తామని, ఇది ఏఐ రంగంలోని నిపుణులు, కంపెనీలు, పరిశ్రమలు, స్టార్ట్‌పులకు వేదికగా ఉంటుందన్నారు.

    ఏఐ పాలసీ రూపకల్పనలో నిపుణులను ఆహ్వానిస్తున్నామని, ఒక స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని నెలకొల్పబోతున్నామని చెప్పారు.

    శంషాబాద్‌ వద్ద పెద్ద స్థలంలో ఏఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌ సెంటర్‌లకు వేదికగా ఉన్న ప్రాంతాన్ని అందిస్తామన్నారు.

    వివరాలు 

    ఏఐ లిటరసీని ప్రోత్సహించటానికి చర్యలు

    డీప్‌ ఫేక్‌లు,తప్పుడు సమాచారం వల్ల వ్యక్తులు,సంస్థలు తప్పుదోవ పట్టకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు.

    డేటా ప్రైవసీ విషయంలో కఠినమైన నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఏఐ నైపుణ్యంతో కూడిన వర్క్‌ ఫోర్స్‌ను తయారుచేసే అంశంపై కూడా దృష్టి పెడుతున్నామని , ఏఐ లిటరసీని ప్రోత్సహించటానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

    తెలంగాణ ఆర్థికంగా ముందుకు పోవడం,11.3 శాతం ఆర్థిక వృద్ధి సాధించడం ద్వారా రాష్ట్రం 176 మిలియన్‌ డాలర్ల ఉత్పత్తి వరకు చేరిందని, త్వరలో ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా మారాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

    జయేష్‌ రంజన్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈ సమ్మిట్‌కు తమ రాష్ట్రం వేదికగా మారడం ఆనందంగా ఉందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దుద్దిళ్ల శ్రీధర్ బాబు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    దుద్దిళ్ల శ్రీధర్ బాబు

    Telangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   ఆర్ బి ఐ
    Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన  మేడిగడ్డ బ్యారేజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025