
Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్ అమలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.
ఈమేరకు ఇరు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు వికాస్ రాజ్ (తెలంగాణ), ముఖేష్ కుమార్ (ఆంధ్రప్రదేశ్) ప్రకటించారు.
సాయంత్రం ఆరుగంటల తర్వాత నియోజకవర్గాల్లోని స్థానికేతర నాయకులు, స్థానికేతరులు నియోజకవర్గాలనుంచి బయటకు వెళ్లిపోవాలని సూచించారు.
పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట ఈ విషయంపై మినహాయింపు ఉంటుందని వారు తెలిపారు.
మే 13 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు.
పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందని వారు తెలిపారు.
Election cmapiagn -Completed
తెలంగాణలో 144 సెక్షన్
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలువుతుందని వెల్లడించారు.
టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం ముగిసిందని తెలిపారు.
పత్రికల్లో ప్రకటనల కోసం ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలన్నారు.
ఓటర్లు ఫోన్లు తెచ్చేందుకు కూడా అనుమతి లేదని తెలిపారు.