మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై 'క్యాష్ ఫర్ క్వెరీ' ఫిర్యాదుపై అక్టోబర్ 26న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై ఆనంద్ దేహద్రాయ్‌లను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించనుంది. అదానీ గ్రూపును, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ తరపున పార్లమెంటులో మొయిత్రా "ప్రశ్నలు అడగడానికి లంచం తీసుకున్నారని" బిజెపి ఎంపి నిషికాంత్ దూబే ఆరోపించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చేసిన ఫిర్యాదులో, తృణమూల్ ఎంపీ ఇటీవలి వరకు పార్లమెంటులో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు హీరానందానీ వ్యాపార ప్రయోజనాలను రక్షించే ఉద్దేశ్యంతో ఉన్నాయని దూబే ఆరోపించారు. మొయిత్రాపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు 'ఎంక్వైరీ కమిటీ'ని ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరారు.
లంచాల లావాదేవీలు జరిగిట్లు అధరాలు ఉన్నాయన్న బీజేపీ ఎంపీ
స్పీకర్ ఓం బిర్లా దూబే ఫిర్యాదును మంగళవారం బిజెపి సభ్యుడు వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన దిగువ సభలోని ఎథిక్స్ కమిటీకి సూచించారు. మహువా మొయిత్రా తన లోక్‌సభ వెబ్‌సైట్ లాగిన్ యాక్సెస్‌ను వ్యాపారవేత్తతో పంచుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మహువా మొయిత్రా- రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త హీరానందానీ గ్రూప్ సీఈఓ దర్శన్ హీరానందానీ మధ్య లంచాల లావాదేవీలు జరిగిట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. అయితే, మోయిత్రా ఆరోపణలను తిరస్కరించారు.దూబే తనపై పెండింగ్‌లో ఉన్న అభియోగాలను పరిష్కరించిన తర్వాత తనపై వచ్చిన ఎటువంటి ఆరోపణలనైనా స్వాగతిస్తున్నాననిపేర్కొన్నారు.