
Tomato: కొత్తపుంతలు తొక్కుతున్న టమాటా ప్రయోగాత్మక సాగు.. పరిమాణంలో మిరియాల మాదిరి
ఈ వార్తాకథనం ఏంటి
టమాటా ప్రయోగాత్మక సాగు కొత్త దారులను తెరిచేస్తోంది. రంగులో వంకాయలా, పరిమాణంలో మిరియాల మాదిరిగా, దోసకాయ,చిన్న గుమ్మడికాయ ఆకారాల్లో ఉన్న టమాటాలు చూడగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
అనంతపురం ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ వేదికగా ఇవన్నీ ఒకే చోట ప్రదర్శించబడుతూ కనులపండువగా నిలిచాయి.
"మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం" అనే అంశాలపై మూడు రోజుల పాటు సాగనున్న సదస్సు, ప్రదర్శనను ఈ కేంద్రం నిర్వహిస్తోంది.
ఈ ప్రదర్శన ప్రధానంగా సుస్థిర వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేయబడింది.
వివరాలు
50 రకాల ప్రత్యేకమైన టమాటా విత్తనాలు
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కూర్మాయి గ్రామానికి చెందిన ప్రకృతి రైతు చందూల్‌కుమార్‌రెడ్డి విభిన్న రకాల టమాటాలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు.
వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన 50 రకాల ప్రత్యేకమైన టమాటా విత్తనాలను ప్రయోగాత్మకంగా పెంచుతున్నట్టు తెలిపారు.
అలాగే, సుభాష్‌పాలేకర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రకృతి సిద్ధమైన వ్యవసాయ విధానాలను పాటిస్తున్నానని వివరించారు.