తదుపరి వార్తా కథనం

Narendra Modi: కుల గణనపై లోక్‌సభలో రగడ.. ఠాకూర్ వ్యాఖ్యలపై ప్రధాని ప్రశంస
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 31, 2024
12:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించి లోక్‌సభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
తన కులం ఏదో తెలియని వ్యక్తి కుల గణన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
అయితే కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించాడు.
Details
ఇండియా కూటమి చెత్త రాజకీయాలను చేస్తోంది : మోదీ
యంగ్, ఎనర్జిటిక్ నాయకుడు అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరూ వినాల్సిందేనని మంగళవారం సాయంత్రం తన X ఖాతాలో పేర్కొన్నారు.
ఇండియా కూటమి చెత్త రాజకీయాలను చేస్తోందని ప్రధాని మోదీ విమర్శలు కురిపించాడు.
అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యాలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా తనను కేంద్రమంత్రి అవమానించారని ఆయన విమర్శించారు.