Page Loader
IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2025
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే వారం కేరళలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో మోస్తరు నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనల నేపథ్యంలో మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసర్‌గడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఇదే సమయంలో పాలక్కాడు, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గడ్ జిల్లాలకు ఆదివారం ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Details

రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. IMD నివేదిక ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అదనంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 11 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదు కావచ్చు. ఎల్లో అలర్ట్ ప్రాంతాల్లో 6 నుంచి 11 సెం.మీ. వర్షం పడే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులకు ముందస్తు జాగ్రత్తగా ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.