NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kunal Kamra:కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యల ఎఫెక్ట్.. కునాల్,రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kunal Kamra:కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యల ఎఫెక్ట్.. కునాల్,రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్
    కునాల్,రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్

    Kunal Kamra:కమెడియన్ కునాల్ కమ్రా వ్యాఖ్యల ఎఫెక్ట్.. కునాల్,రాహుల్‌గాంధీ, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 24, 2025
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై హాస్య నటుడు కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

    థానే ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు బీజేపీతో చేతులు కలిపి శివసేనను విభజించాడంటూ, అతడిని దేశద్రోహిగా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

    ముంబైలోని ఖార్ ప్రాంతంలోని 'ది హాబిటాట్ కామెడీ'క్లబ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో,కునాల్ కమ్రా ప్రముఖ"దిల్ తో పాగల్ హై" పాటను రాజకీయ సరస్వతిగా మార్చి ప్రదర్శించారు.

    ఇందులో షిండేపై ద్వంద్వార్థం ఉన్న పదాలను ఉపయోగించడంతో పాటు,దేశద్రోహిగా సంబోధించడం ఆయన అనుచరుల ఆగ్రహానికి కారణమైంది.

    ఈఘటనతో షిండే అభిమానులు విపరీతంగా స్పందించారు.కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో,శివసేన కార్యకర్తలు కామెడీ క్లబ్‌పై దాడికి పాల్పడ్డారు.

    ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు చేపట్టారు.

    వివరాలు 

    షిండేపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు

    వివాదం పెరగడంతో,శివసేన యువసేన ప్రధాన కార్యదర్శి రాహుల్ కనాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    కునాల్ కమ్రా‌తో పాటు,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రేపై కూడా ఫిర్యాదు నమోదు చేశారు.

    ఫిర్యాదులో,కునాల్ ఒక చెల్లింపు కమేడియన్‌గా వ్యవహరించి,ముందస్తు ప్రణాళికతో షిండేపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు.

    ఇది ఒక కుట్రలో భాగమేనని శివసేన నేతలు పేర్కొన్నారు.కునాల్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, షిండేపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    2023 భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం,ఈ వ్యాఖ్యలు చట్టబద్ధంగా అభ్యంతరకరమైనవని వెల్లడించారు.

    షిండే పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం న్యాయపరంగా సరైనది కాదని ఫిర్యాదులో తెలిపారు.

    వివరాలు 

    శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసునమోదు

    ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేయడం అంగీకారమే అయినా,అవమానించేలా ఉండకూడదని, అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    దీనితో పాటు,కామెడీ క్లబ్‌పై దాడి చేసిన శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసునమోదు చేశారు.

    క్లబ్‌లోని కుర్చీలు విసిరివేయడం,సామగ్రిని ధ్వంసం చేయడం,అలాగే ఓ ఎంపీ కునాల్‌ను బెదిరించారని ఆరోపణలు వచ్చాయి.

    దేశంలో ఎక్కడా తిరగనివ్వమని హెచ్చరించినట్లు సమాచారం.శివసేన(యూబీటీ)ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఈ ఘటనను ఖండించారు.

    మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు.శివసేన కార్యకర్తల విధ్వంస దృశ్యాలను నేత సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    రాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరిపాలన దుర్బలంగా మారిందని ఆరోపించారు.

    కునాల్ కమ్రా మహారాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్య పాట రూపొందించారని,దానికి ప్రతిస్పందనగా షిండే అనుచరులు క్లబ్‌ను ధ్వంసం చేయడం అసహ్యకరమని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ
    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  ఆంధ్రప్రదేశ్
    Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ ప్రపంచం
    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప

    మహారాష్ట్ర

    Cabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది! దేవేంద్ర ఫడణవీస్‌
    Mumbai Ferry boat: ట్రయల్ రన్ కి ఎవరు అనుమతి ఇచ్చారు? నేవీని ప్రశ్నించిన ముంబై పోలీసులు  భారతదేశం
    Raj-Uddhav Reunite: రాజకీయ శత్రువుల కలయిక.. పెళ్లి వేడుకల్లో కలుసుకున్న రాజ్-ఉద్ధవ్ ఠాక్రే ఇండియా
    Pune: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపై దూసుకెళ్లిన ట్రక్‌.. ముగ్గురు మృతి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025