
Piyush Goyal: 2025 నవంబర్ నాటికి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం : పియూష్ గోయల్
ఈ వార్తాకథనం ఏంటి
మొత్తానికి అమెరికా, భారత్ లు ఒకదారిలోకి వచ్చాయి.ఈ క్రమంలో,రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను సిద్దం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో,ట్రంప్ విధానం వల్ల అదనపు సుంకాలు విధించడంవల్ల భారత్-అమెరికా సంబంధాలలో కొంతకాలం గ్యాప్ వచ్చింది, కానీ ఇప్పుడు మళ్లీ రెండు దేశాలు ఒక ముంగిటకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కాస్త దిగి వచ్చినట్టు కనిపించింది ఆయన స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని చెప్పారు. దీనికి మోదీ కూడా సానుకూల స్పందన ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు పాట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, వాణిజ్య చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు.
వివరాలు
నవంబర్ వరకు…
వాణిజ్య ఒప్పందాల కుదిరికే లక్ష్యంతో, ఫిబ్రవరిలోనే ట్రంప్ అధ్యక్షుడు, ప్రధాని మోదీ, నవంబర్ నాటికి అన్ని చర్చలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు విడతల చర్చలు జరగగా, మధ్యలో అదనపు టారిఫ్ విధించడంవల్ల వాటికి బ్రేక్ వచ్చింది. అయితే, ఇప్పుడు రెండు దేశాలు మళ్లీ చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, నవంబర్ లో జరిగే చర్చలు పూర్తి స్థాయిలో కొనసాగించి, తగిన ఒప్పందాలను కుదుర్చుకుంటామని మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. చర్చలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని, కానీ సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నామని ఆయన వివరించారు.