Khammam: మున్నేరుకు వరద.. మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టడంతో,తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తీవ్ర వరదల పాలయ్యింది. వర్షాల కారణంగా మున్నేరు పరివాహక ప్రాంతం ఇప్పుడు ప్రమాద జోన్‌గా మారిందని సమాచారం అందుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈరోజు రాత్రి వరద నీరు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్,ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు కాలువకు వరద నీరు పోటెత్తింది.
24 అడుగులు దాటితే,రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ప్రస్తుతానికి నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో,అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఖమ్మం సిటీలో పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు.ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద నీరు 24 అడుగులు దాటితే,రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు.