LOADING...
Yoga guru Ramdev: మరణ శిక్షకైనా సిద్ధం: సుప్రీంకోర్టు హెచ్చరికపై రామ్‌దేవ్ కామెంట్స్
Yoga guru Ramdev: మేం అబద్ధాలకోరులమైతే రూ.1000 కోట్ల జరిమానా విధించండి: రామ్‌దేవ్‌

Yoga guru Ramdev: మరణ శిక్షకైనా సిద్ధం: సుప్రీంకోర్టు హెచ్చరికపై రామ్‌దేవ్ కామెంట్స్

వ్రాసిన వారు Stalin
Nov 22, 2023
06:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

పతంజలి ఆయుర్వేద కంపెనీ యాడ్స్‌తో ప్రజలను తప్పుదోవ పటిస్తోందని సుప్రీంకోర్టు మంగళవారం మందలించిన విషయం తెలిసిందే. తప్పుడు యాడ్స్ ప్రచురిస్తే జరిమానా విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. అయితే సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో పతంజలి కంపెనీ సహ వ్యవస్థాపకుడు యోగా గురు స్వామి బాబా రామ్‌దేవ్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పతంజలి కంపెనీ ఎలాంటి తప్పుడు యాడ్స్‌ను ప్రచురించలేదని రామ్‌దేవ్ పేర్కొన్నారు. తాము సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. యోగా, ఆయుర్వేదానికి వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం చేయడానికి కొంతమంది వైద్యులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు.

పతంజలి

ఐదేళ్లుగా మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రామ్‌దేవ్ 

తాము అబద్ధాలకోరులైతే తమపై మాపై రూ.1000 కోట్ల జరిమానా విధించాలని, అవసరమైతే మరణశిక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని రామ్‌దేవ్ స్పష్టం చేశారు. పతంజలి విడుదల చేసిన ఆయుర్వేద ఉత్పత్తులకు అవసరమైన అన్ని క్లినికల్ ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. గత ఐదేళ్లుగా స్వామి రామ్‌దేవ్, పతంజలిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పురాతన ఆయుర్వేద వైద్యాన్ని కొందరు అవమానిస్తున్నారని రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఆయుర్వేదం వైద్య వల్ల కొందరు మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలను దెబ్బతింటాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, అవన్ని అవాస్తవమన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రామ్ దేవ్