భగ్గుమంటున్న భానుడు; మరో మూడు రోజులు వేడిగాలులకు అల్లాడాల్సిందే
పశ్చిమ బెంగాల్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల్లో సూర్యుడు మరింత మండనున్నట్లు వాతావరణ కార్యాలయం మంగళవారం అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, గంగానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాలు, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రానున్న మూడు రోజులలో వేడి గాలులు విపరీతంగా వీస్తాయని భారత వాతావరణ తెలిపింది. రాబోయే 24గంటల్లో ఉప హిమాలయ బెంగాల్, సిక్కిం, ఒడిశాలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. రానున్న రెండు రోజుల్లో జార్ఖండ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు వేడిగాలులు
కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు వేడి గాలులు కొనసాగనున్నాయి. గత 6రోజుల నుంచి గంగా నది బెంగాల్‌లో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో గత 4రోజుల నుంచి, బిహార్‌లో గత 3రోజుల నుంచి హీట్ వేవ్ పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ కార్యాలయం పేర్కొంది. దేశంలో రోజుకురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, సోమవారం ఒక్కరోజే 36 వాతావరణ కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైనట్లు ఐఎండీ చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (44.6డిగ్రీలు), ఒడిశాలోని బరిపడా (44.2డిగ్రీలు) అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నగరాలుగా నిలిచాయి. పశ్చిమ తీరంలోని మహారాష్ట్రలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది.